సారథిన్యూస్, రామగుండం: సింగరేణిలోని బొగ్గును దొంగిలించనవారిపై పీడీ యాక్ట్ కేసులు నమోదు చేస్తామని రామగుండం పోలీస్ కమిషనర్ వీ సత్యనారాయణ పేర్కొన్నారు. రామగుండం కమిషనరేట్ పరిధిలో సింగరేణిలో తరుచుగా బొగ్గును దొంగిలిస్తున్న దుస్స దేవేందర్‌పై పీడీ యాక్ట్ నమోదు చేసినట్టు ఆయన తెలిపారు. అనంతరం సదరు నిందితుడిపై కేసునమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు.