Breaking News

బైబై.. గణేశా!

బైబై.. గణేశా!

సారథి న్యూస్, కర్నూలు: కర్నూలు నగరంలో 9రోజుల పాటు భక్తిశ్రద్ధలతో పూజలు అందుకున్న వినాయకుడు గంగమ్మ ఒడికి చేరాడు. ఆదివారం నిమజ్జనోత్సవం అత్యంత వైభవంగా సాగింది. ఆయా మండపాల వద్ద కొలువుదీరిన బొజ్జ గణపయ్య నిమజ్జనానికి తరలివెళ్లాడు. ఈ సారి కరోనా మహమ్మారి విజృంభించిన నేపథ్యంలో వేడుకలను కొంత నిరాడంబరంగానే జరుపుకున్నారు. స్థానిక ఎమ్మెల్యే హఫీజ్​ఖాన్, ఎస్పీ డాక్టర్​ఫక్కీరప్ప, మాజీ ఎమ్మెల్యే ఎస్​వీ మోహన్​రెడ్డి.. తదితర ప్రముఖులు ఉత్సవాల్లో పాల్గొన్నారు.
మత సామరస్యానికి ప్రతీక
అంతకుముందు నగరంలోని రాంభట్ల ఆలయం వద్ద ఏర్పాటుచేసిన వినాయక మండపం వద్ద ప్రత్యేకపూజల్లో ఎమ్మెల్యే హఫీజ్​ఖాన్​పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కర్నూలు నగరం మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తుందన్నారు. సామాజిక దూరం పాటిస్తూనే పూజా కార్యక్రమాలు నిర్వహించారు. వన్ టౌన్ నుంచి వినాయక ఘాట్ వరకు చిన్నచిన్న విగ్రహాలను ఊరేగింపుగా తీసుకెళ్లి నిమజ్జనం చేశారు.

పూజా కార్యక్రమాల్లో ఎమ్మెల్యే తదితరులు
వినాయక విగ్రహాన్ని తీసుకొస్తున్న మాజీ ఎమ్మెల్యే ఎస్​వీ మోహన్​రెడ్డి తదితరులు
వినాయకుడిని నిమజ్జనానికి తీసుకెళ్తున్న యువతులు
మట్టి వినాయకుడిని తీసుకెళ్తున్న చిన్నారి
నిమజ్జనోత్సవంలో యువత కేరింత
ట్రాక్టర్​లో వినాయకుడి తీసుకెళ్తుండగా.. వాహనాన్ని నడుపుతున్న ఎమ్మెల్యే హఫీజ్​ఖాన్​