సారథి న్యూస్, బిజినేపల్లి: దుబ్బాకలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్, మాజీ ఎంపీలు ఏపీ జితేందర్ రెడ్డి, జి.వివేక్ అరెస్టులను నిరసిస్తూ మంగళవారం నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో ధర్నా నిర్వహించారు. దుబ్బాకలో ఓటమి భయంతోనే మంత్రి టి.హరీశ్‌రావును రంగంలోకి దించి పోలీసులతో రఘునందన్‌రావు బంధువుల ఇంటికి పోలీసుల సహాయంతో డబ్బులు పంపించారని విమర్శించారు. మాజీ ఎంపీలు వివేక్, ఏపీ జితేందర్‌రెడ్డి అక్రమంగా అరెస్ట్ చేశారని ఖండించారు. అనంతరం బీజేపీ నాయకులు, కార్యకర్తలను స్థానిక పోలీసులు అరెస్ట్‌చేశారు. కార్యక్రమంలో బిజేపీ మండల నాయకులు వెంకట్రాములు, బాలస్వామి, మల్లెకేడి లక్ష్మీనారాయణ, శివారెడ్డి, తిరుపతయ్య, రాజు, బీజేవైఎం నాయకులు శ్రీరాములు, రాఘవేందర్ గౌడ్, శ్రీను, బాలకృష్ణ, గిరిజన మోర్చా నాయకులు శ్రీనునాయక్, అమర్, మైనార్టీ మోర్చా నాయకులు జాకీర్‌హుసేన్, మహమూద్, నేతలు ప్రవీణ్ రెడ్డి, సురేందర్ రెడ్డి పాల్గొన్నారు.
- October 27, 2020
- Archive
- మహబూబ్‌నగర్
- లోకల్ న్యూస్
- AP JIDENDARREDDY
- BANDI SANJAYKUMAR
- BIJINEPALLY
- BJP
- ఏపీ జితేందర్‌రెడ్డి
- నాగర్‌కర్నూల్
- బండి సంజయ్‌కుమార్
- బిజినేపల్లి
- బీజేపీ
- Comments Off on బీజేపీ నేతల అరెస్ట్ అక్రమం