- యూపీ వెళ్లేందుకు 10 బస్సుల ఏర్పాటు
ముంబై: బాలీవుడ్ స్టార్ బిగ్ బీ మరోసారి తన పెద్ద మనసు చాటుకున్నారు. యూపీకి చెందిన వలస కార్మికులు తమ సొంతూళ్లకు వెళ్లేందుకు 10 బస్సులను ఏర్పాటుచేశారు. ముంబైలోని హజీ అలీ దర్గా నుంచి శుక్రవారం ఉదయం 10 బస్సులు బయలుదేరి వెళ్లాయి. ఏబీసీఎల్ మేనేజింగ్ డైరెక్టర్ రాజేశ్ యాదవ్, మాహిం దర్గా ట్రస్ట్ మేనేజింగ్ డైరెక్టర్ సుహేల్ ఖండ్వానీ పచ్చజెండా ఊపి బస్సులు ప్రారంభించారు. యూపీలోని ప్రయాగ్‌రాజ్, గోరఖ్‌పూర్, భదోయ్, లక్నో ప్రాంతాలకు బస్సులను ఏర్పాటుచేసినట్లు సుహేల్ తెలిపారు.
బస్సులో ప్రతిఒక్కరూ సోషల్ డిస్టెంసింగ్ పాటించేలా జాగ్రత్తలు తీసుకున్నామని, వారికి శానిటైజర్లు, గ్లౌస్లు కూడా అందించామన్నారు. అమితాబ్ గతంలో ఆలిండియా ఫిల్మ్ ఎంప్లాయీస్ కాన్ఫిడరేషన్‌కు చెందిన లక్ష రోజువారీ కూలీ కార్మికుల కుటుంబాలకు నెలకు సరిపడా రేషన్ అందించారు. లాక్ డౌన్ వల్ల పనులు కోల్పోయిన వలస కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ మేరకు వారికి బాలీవుడ్ యాక్టర్ సోనుసూద్ సాయం చేసిన విషయం తెలిసిందే.