Breaking News

బాలూ.. ప్రపంచస్థాయి గాయకుడు

సారథి న్యూస్, రామగుండం: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ప్రపంచస్థాయి గాయకుడని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్​ పేర్కొన్నారు. మంగళవారం స్థానిక లక్ష్మీఫంక్షన్​హాల్​లో రామగుండం సంస్కృతి సంక్షేమ కమిటీ ఆధ్వర్యంలో ఎస్పీ బాలూ సంస్మరణసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చందర్​ మాట్లాడుతూ.. బాలూ గొప్ప కళాకారుడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో నగర డిప్యూటీ మేయర్ అభిషేక రావు, కార్పొరేటర్లు అడ్డాల సరూప, రామస్వామి, జంగపల్లి సరోజన, కనకయ్య, కృష్ణవేణి భూమయ్య, బాల్ రాజ్ కుమార్, దాత శీను వాస్, కో ఆప్షన్ సభ్యులు బుచ్చిరెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ఎం విజయ రెడ్డి, జాలి రాజమణి, ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు వంశీ, కోశాధికారి దయానంద్ గాంధీ, నాయకులు పీ గోపాల్ రావు, టీ శంకర్ గౌడ్, ఆడప శ్రీనివాస్, నూతి తిరుపతి తదితరులు పాల్గొన్నారు.