Breaking News

బాబాయ్ ని చంపిన అబ్బాయ్​

బాబాయ్ ని చంపిన అబ్బాయ్​

సారథి న్యూస్, సూర్యాపేట: సూర్యాపేట జిల్లా ఆత్మకూర్(ఎస్) మండలం పాతర్ల పహాడ్ గ్రామంలో ఆదివారం దారుణం జరిగింది. స్థానికుల కథనం మేరకు.. మద్యం తాగిన మైకంలో సొంత బాబాయ్ లచ్చయ్య(55)ను గొడ్డలితో అన్న కొడుకు వెంకన్న నరికి చంపాడు. తీవ్రమైన రక్తపు మడుగులో లచ్చయ్య అక్కడికక్కడే చనిపోయాడు. నిందితుడు వెంకన్న పరారీలో ఉన్నాడు. ఈ దారుణఘటనకు దారితీసిన కారణాలు తెలియాల్సి ఉంది.