ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డే కు అదిరిపోయే ట్రీట్అందింది. ‘వకీల్ సాబ్’ సినిమాలో పవన్ నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా ఫ్యాన్స్‌కు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చింది చిత్ర యూనిట్. ముందుగా ప్రకటించిన విధంగానే ఈ రోజు ఉదయం 9.09 గంటలకు ‘వకీల్ సాబ్’ మోషన్ పోస్టర్ ను విడుదల చేసి పవన్ కళ్యాణ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. భారతరత్న డాక్టర్ అంబేద్కర్, మోహన్ దాస్ కరంచంద్ గాంధీ ఫొటోలో మధ్యలో పవన్ కళ్యాణ్ లాయర్ గెటప్ లో చైర్ మీద ఒక కాలు పెట్టి ఠీవీగా నిలబడి కనిపిస్తున్నాడు. ఒక చేతిలో క్రిమినల్ లా బుక్ మరో చేతిలో క్రిమినల్స్ ని దండించడానికి అన్నట్టు బేస్ బాల్ స్టిక్ పట్టుకుని సీరియస్ లుక్ లో ఉన్నాడు. ఈ పోస్టర్ లో ఉన్న పవన్ స్టిల్ చూస్తుంటే ఇది ఫైట్ కి సంబంధించిన సీన్ అని అర్థమవుతోంది. దీనికి తగ్గట్టుగా మ్యూజిక్ డైరెక్టర్ తమన్ అందించిన ‘సత్యమేవ జయతే..’ అనే బ్యాగ్రౌండ్ స్కోర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దాదాపు మూడేళ్ళ తర్వాత తమ అభిమాన హీరో సినిమాకి సంబంధించిన పోస్టర్ రావడంతో పవన్ ఫ్యాన్స్ ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇంకా ఈ చిత్రంలో నివేతా థామస్, అంజలి కీలకపాత్రల్లో కనిపించనుండగా దిల్ రాజు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.
- September 2, 2020
- Archive
- సినిమా
- MOTION POSTER
- PAWANKALYAN
- VAKILSAB
- డాక్టర్అంబేద్కర్
- పవన్‌కళ్యాణ్
- మోషన్ పోస్టర్
- మోహన్ దాస్ కరన్చంద్
- వకీల్‌సాబ్
- Comments Off on బర్త్ డే విషెస్ అదరహో..