సారథి న్యూస్, హైదరాబాద్: లాక్‌డౌన్ టైంలోబయటకు వెళ్లాలనుకుంటున్నారా.. ఇదివరకు ఏదో ఒకటిచెప్పి లోకల్‌లో తిరిగేశారు. కానీఇకపై ఆన్ లైన్‌లో పాస్ తీసుకోవాల్సిందే. ఇందుకోసం పోలీసు శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ప్రత్యేకంగా ఓ వీడియో రూపొందించి విడుదల చేసింది. ఈ పాస్ కావాలంటే ముందుగా వీడియోలో తెలిపినట్లుగా వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. అప్లికేషన్ ఫామ్ నింపాలి. ఆ తర్వాత ఫొటో, ఆధార్ కార్డు అటాచ్ చేయాలి. పది నిమిషాల్లో స్పెషల్ బ్రాంచ్ పోలీసులు అప్రూవ్ చేస్తారు. ఇది మన ముబైల్ నంబర్‌కు మెసేజ్ కూడా వస్తుంది. ఆ తర్వాత లింక్ ఓపెన్ చేసి ఫామ్ డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.
- April 20, 2020
- Top News
- తెలంగాణ
- పాస్
- పోలీసుశాఖ
- లాక్ డౌన్
- Comments Off on బయటికెళ్తున్నారా.. పాస్ తప్పనిసరి