విలక్షణ నటుడిగా కోలీవుడ్ లోనే కాదు బాలీవుడ్లో కూడా అభిమానులను సంపాదించుకున్నాడు ఆది పినిశెట్టి. ‘గుండెలో గోదారి’, ‘సరైనోడు’, ‘నిన్ను కోరి’ సినిమాల్లో తనదైన నటనతో తెలుగు వారి ఆదరణ పొందాడు. తర్వాత కమర్షియల్ డైరెక్టర్ సుకుమార్ రామ్ చరణ్ కాంబోలో వచ్చిన ‘రంగస్థలం’లో రామ్ చరణ్ అన్నగా నటించి ఇక్కడి వారికి మరింత దగ్గరయ్యాడు. ప్రస్తుతం పక్కా మాస్ అండ్ కమర్షియల్ ఎంటర్ టైనర్ గా భారీ క్యాస్ట్ అండ్ క్రూ తో డైరెక్టర్ సుకుమార్ అల్లు అర్జున్ కాంబోలో ‘పుష్ప’ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో అల్లు అర్జున్ లారీడ్రైవర్ క్యారెక్టర్లో కనిపిస్తుండగా.. కథ పరంగా హీరోకు ఇద్దరు అన్నయ్యలు ఉంటారని వారిలో ఒకరు గ్రామ సర్పంచ్ అని తెలుస్తోంది.
అయితే సర్పంచ్ క్యారెక్టర్లో ఆది నటించనున్నారనే వార్త వైరల్ అవుతోంది. ఇది ఎంతవరకూ నిజమో అధికారిక ప్రకటన అయితే ఇంకా రాలేదు. అల్లు అర్జున్ కు జోడీగా రష్మిక మందాన్న నటిస్తోంది. సినిమా షూటింగ్ ను ఆగష్టు నుంచి మొదలు పెట్టనున్నారు. అయితే మైత్రీ మూవీ మేకర్స్, ముత్యం శెట్టి మీడియా వారు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు.