Breaking News

బతుకమ్మ చీరలు పంపిణీ

బతుకమ్మ చీరలు పంపిణీ

సారథి న్యూస్, మెదక్: ప్రతి ఆడపడుచు తెలంగాణకు ప్రత్యేకమైన బతుకమ్మ పండగను ఘనంగా జరుపుకోవాలని మెదక్​ఎమ్మెల్యే పద్మాదేవేందర్​రెడ్డి ఆకాంక్షించారు. ఆదివారం మెదక్​జిల్లా చిన్నశంకరంపేట మండలం గవ్వలపల్లిలో మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పద్మాదేవేందర్​రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత ఆడపడుచులు బతుకమ్మ పండగను ఆనందంగా జరుపుకోవడానికి ప్రభుత్వం చీరలను అందిస్తోందన్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లోని గ్రామాల్లో బతుకమ్మ చీరల పంపిణీ చేస్తామని డీఆర్​డీవో శ్రీనివాస్​ తెలిపారు. కార్యక్రమంలో చిన్నశంకరంపేట జడ్పీటీసీ సభ్యురాలు మాధవి, ఆయా గ్రామాల ఎంపీటీసీలు, సర్పంచ్​లు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.