Breaking News

ఫ్రంట్​లైన్​ వారియర్స్​కు కరోనా వ్యాక్సిన్​

ఫ్రంట్​లైన్​వారియర్స్​కు కరోనా వ్యాక్సిన్​

సారథి న్యూస్, మెదక్: కరోనా సమయంలో వైద్యసిబ్బంది ఫ్రంట్ లైన్ లో ఉండి జిల్లా ప్రజలకు వైద్యసేవలు అందించడంలో శాయశక్తులా కృషిచేసి మరణాలను నివారించగలిగారని జిల్లా ఇన్​చార్జ్​కలెక్టర్​పి.వెంకట్రామరెడ్డి ప్రశంసించారు. ఇదే స్ఫూర్తితో త్వరలో రాబోయే కోవిడ్ వ్యాక్సిన్ ను ప్రాధాన్యతా క్రమంలో ఇచ్చేందుకు ముందస్తు ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. శనివారం కలెక్టరేట్ లోని వైద్యాధికారుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎలాంటి విపత్తునైనా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషిచేసిందన్నారు. కరోనా వ్యాక్సిన్​ను తొలిదశలో కోవిడ్ ఫ్రంట్ లైన్ ​వారియర్స్ గా పనిచేస్తున్న 4,073 ప్రభుత్వ, ప్రైవేట్​ వైద్యసిబ్బంది, రెండో దశలో పొలీసు సిబ్బంది, మున్సిపల్ పారిశుద్ధ్య సిబ్బంది, అంగన్​వాడీ సిబ్బంది, మూడో దశలో 50 ఏళ్లు పైబడిన వ్యక్తులు, బీసీ, షుగర్, కేన్సర్ తదితర దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి వేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. అందుకు తగిన విధంగా వైద్యాధికారులు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. జిల్లాలో గుర్తించిన 75,490 మంది పిల్లలకు ఈనెల 17న ఏర్పాటుచేసిన 598 బూత్​ల్లో 1,196 బృందాల ద్వారా పోలియో చుక్కల మందును వేయించాలని ఆదేశించారు. ఆ తర్వాత 18,19 తేదీల్లో ఆరోగ్య కార్యకర్తలు ఇంటింటికి తిరిగి పోలియో చుక్కలు వేస్తారని తెలిపారు. సమావేశంలో డీఎంహెచ్​వో వెంకటేశ్వర్లు, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి సుమిత్రారాణి, ఎస్​ఎంవో మురళి,రాజేంద్రప్రసాద్, మెదక్, నర్సాపూర్, తూప్రాన్ అడిషనల్​ మెడికల్​ ఆఫీసర్లు అనిల, విజయనిర్మల, అరుణశ్రీ, పాండురంగారావు, ఇతర వైద్యాధికారులు పాల్గొన్నారు.