- ప్రారంభించిన మంత్రి కేటీఆర్
సారథి న్యూస్, హైదరాబాద్: నగరంలోని బయోడైవర్సిటీ జంక్షన్ వద్ద నిర్మించిన ఫస్ట్ లెవెల్ ఫ్లై ఓవర్ బ్రిడ్జిని మున్సిపల్‌శాఖ మంత్రి కె.తారక రామారావు గురువారం ప్రారంభించారు. ఈ ఫ్లై ఓవర్ బ్రిడ్జి అందుబాటులోకి రావడంతో గచ్చిబౌలి నుంచి మెహిదీపట్నం వైపునకు వెళ్లే వాహనదారులకు ట్రాఫిక్ ఇబ్బందులు తీరనున్నాయి. ఈ ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి రూ.30.26 కోట్లు వ్యయం అయినట్లు అధికారులు వెల్లడించారు.
కార్యక్రమంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి, గ్రేటర్ హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహన్, ఎమ్మెల్యేలు దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, మంచిరెడ్డి కిషన్ రెడ్డి, డిప్యూటీ మేయర్ బాబా ఫసియోద్దిన్, మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్, జలమండలి ఎండీ దానకిషోర్, కార్పొరేటర్లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.