Breaking News

ప్లాస్మా ఇస్తే ఐదువేలు ప్రోత్సాహం

బెంగళూరు: ప్లాస్మా దానం చేసే కరోనా రోగులకు రూ.5000 ప్రోత్సాహం అందిస్తామని కర్ణాటక ప్రభుత్వం ప్రకటించింది. కరోనా రోగులకు ప్లాస్మాథెరపీతో ఆశాజన ఫలితాలు వస్తున్న విషయం తెలిసిందే. ప్లాస్మాథెరపీ వైద్యం చేయాలంటే ఇప్పటికే వ్యాధి సోకి నయమైనవారి రక్తంలో నుంచి ప్లాస్మా తీసుకోవాల్సి ఉంటుంది. కానీ కరోనా బాధితులు ప్లాస్మా ఇచ్చేందుకు ముందుకు రావడంలేదు. దీంతో ప్లాస్మా ఇచ్చే వారికి రూ.5000 ప్రోత్సాహం ఇస్తామంటూ కర్ణాటక రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రిబీ శ్రీరాములు ప్రకటించారు.కరోనా నుంచికోలుకున్న వారు మంత్రి ప్రకటనతోనైనా ముందుకొస్తారేమో చూడాలి. అయితే ప్లాస్మా దానం చేయడం వల్ల ఎటువంటి అనారోగ్యం ఉండదని మంత్రి చెప్పారు.