సారథి న్యూస్, మానవపాడు(జోగుళాంబ గద్వాల): జోగుళాంబ గద్వాల జిల్లా అల్లంపూర్ మార్కెట్చైర్మన్ప్రమాణ స్వీకారం శుక్రవారం ప్రోటోకాల్ వివాదానికి దారితీసింది. మార్కెట్ యార్డ్ చైర్మన్ ప్రమాణ స్వీకారం కార్యక్రమాన్ని ఎమ్మెల్యే అబ్రహం చేతులమీదుగా జరిపించారు. కార్యక్రమానికి పుల్లూరు గ్రామ సర్పంచ్ నారాయణమ్మను పిలువలేదు. దీంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పదవి బాధ్యతల స్వీకరణను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. అంతేకాకుండా కార్యక్రమానికి సొంత పార్టీకి చెందిన జడ్పీటీసీ రాములమ్మ, ఎంపీటీసీ వరలక్ష్మి, ఎంపీపీని కూడా పిలువలేదు. దీంతో వారు కూడా కొంత మనస్తాపానికి గురయ్యారు. ఇదే క్రమంలో గతనెల మానవపాడు మండల కేంద్రంలోని సెగ్రిగేషన్ షెడ్ ప్రారంభోత్సవానికి జడ్పీచైర్‌పర్సన్ సరితా తిరుపతయ్య రాకముందే ప్రారంభించి వెళ్లిపోయారు. అక్కడ కూడా ప్రోటోకాల్లొల్లి జరిగింది. తాజా అలాంటి ఘటన జరగడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
- July 24, 2020
- Archive
- మహబూబ్‌నగర్
- లోకల్ న్యూస్
- షార్ట్ న్యూస్
- ALAMPUR
- PROTOCOL
- PULLUR
- అలంపూర్ మార్కెట్
- పుల్లూరు
- ప్రోటోకాల్
- Comments Off on ప్రోటోకాల్ లొల్లి