Breaking News

ప్రైవేట్ టీచర్లను ఆదుకుందాం.. రండి

ప్రైవేట్ టీచర్లను ఆదుకుందాం.. రండి

సారథి న్యూస్, ములుగు: సమాజ విజ్ఞానాభివృద్ధికి మూలం, దైవం కన్నా మిన్న అయిన ఉపాధ్యాయులకు ప్రతిఒక్కరూ చేయూతనివ్వాలని సర్వర్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహమ్మద్ అన్నారు. ఆదివారం స్థానిక ఎస్టీయూ భవన్ లో ములుగు జిల్లా ప్రైవేట్ టీచర్లకు సర్వర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బియ్యం, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన ప్రైవేట్ టీచర్లను ఆదుకునేందుకు ప్రతిఒక్కరూ ముందుకురావాలని పిలుపునిచ్చారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా చాలా మంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. అనంతరం సర్వర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 120 మంది ప్రైవేట్​టీచర్లకు బియ్యం, ఇతర నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు బేతిసాయి రెడ్డి, మామిడిపల్లి రమేష్, సమ్మయ్య, శ్రీనివాస్, శేఖర్, సిద్దు, పలువురు టీచర్లు పాల్గొన్నారు.