సారథి న్యూస్, వరంగల్: వివాహేతర సంబంధం పెట్టుకున్న భర్తను ప్రియురాలి ఇంట్లో భార్య పట్టుకుని చితకబాదింది. ఈ ఘటన వరంగల్ సిటీలో బుధవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. వరంగల్ అర్బన్ జిల్లా పోతన్ నగర్ లో నివాసం ఉంటున్న భార్యాభర్తలు తులసి, శ్రీనివాస్ కు పదేళ్ల క్రితం వివాహమైంది. తులసి ప్రభుత్వ ఉద్యోగిని. తరుచూ ఇద్దరూ గొడవపడేవారు. భార్య సంపాదనతోనే కుటుంబం గడుస్తోంది. అయితే రెండు నెలలైనా భర్త ఇంటికి రాకపోవడంతో ఆమెకు అనుమానం వచ్చింది. మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని గుర్తించింది. పక్కాసమాచారంతో స్థానిక బీట్ బజార్ లో నివాసం ఉంటున్న ప్రియురాలు ఇంట్లో రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని దేహశుద్ధిచేసింది. భర్తను పట్టుకుని ఇంతజార్గంజ్ పోలీస్స్టేషన్లో అప్పగించింది. తనకు న్యాయం చేయాలని స్థానిక పోలీసులకు ఫిర్యాదుచేసింది.
- May 27, 2020
- క్రైమ్
- తెలంగాణ
- WARANGAL
- WIFE
- పోతన్ నగర్
- బీట్ బజార్
- Comments Off on ప్రియురాలితో రెడ్ హ్యాండెడ్గా దొరికిన భర్త