రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న చిత్రానికి తమిళ యువ సంగీత దర్శకుడు జస్టిన్ ప్రభాకరన్ బాణీలు అందిస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే ప్రభాకరన్ ఈ చిత్రం కోసం కొన్ని ట్యూన్స్ సిద్ధం చేసినట్టు టాక్. ప్రభాస్ 20వ చిత్రం ఇప్పటికే ప్రారంభమైనా దానికి సంబంధించిన ఎటువంటి వివరాలు బయటకు తెలియడం లేదు. దీంతో యంగ్ రెబల్ స్టార్ అభిమానులు ఒకింత నిరాశలో ఉన్నారు. ఈ చిత్ర షూటింగ్ ఎక్కువగా విదేశాల్లో జరుగడం ఇందుకు కారణమని చిత్ర యూనిట్ చెబుతున్నది. కనీసం ప్రభాస్ ఫస్ట్ లుక్ కూడా వచ్చేట్టు లేదని ఫ్యాన్స్ చాలా నిరాశకు గురవుతున్నారు. దీంతో ఈ చిత్రానికి ప్రభాకరన్ సంగీతాన్ని సమకూరుస్తున్నట్టు తెలుస్తున్నది. విజయ్ దేవరకొండ నటించిన ‘డియర్ కామ్రేడ్’ చిత్రం ప్రభాకరన్ స్వరాలు సమకూర్చారు. ఆ సినిమా అంతగా ఆడకపోయినా సంగీతానికి మంచి పేరు వచ్చింది. అయితే ఈ సినిమాకు ‘రాధే శ్యామ్’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్టు సమాచారం. పాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న ఈ చిత్రంలో వచ్చే ఏడాది వేసవిలో విడుదల చేయనున్నారు. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన పూజాహేగ్డే నటిస్తున్నది.
- June 21, 2020
- Archive
- సినిమా
- MUSIC
- NEWMOVIE
- PRABHAKARAN
- PRABHAS
- పూజాహేగ్డే
- బాణీలు
- Comments Off on ప్రభాస్ సినిమాకు ప్రభాకరన్ బాణీలు