Breaking News

ప్రభాస్​.. ఫస్ట్ లుక్ ఆతృత

ప్రభాస్​..ఫస్ట్ లుక్ ఆతృత


వరల్డ్ వైడ్ స్టార్ డార్లింగ్ ప్రభాస్ ప్రస్తుతం పీరియాడిక్ లవ్ డ్రామాలో నటిస్తున్నాడు. ‘జిల్’ ఫేమ్ రాధా కృష్ణ కుమార్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ గోపికృష్ణ మూవీస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ రెండో షెడ్యూల్ కూడా పూర్తయ్యింది. అయితే టైటిల్ కూడా ఇంకా ఫిక్స్ చేయకుండా.. సినిమా గురించి ఎలాంటి అప్ డేట్స్ ఇవ్వకుండా ప్రబాస్ డైహార్డ్ ఫ్యాన్స్ని తీవ్ర నిరుత్సాహానికి గురి చేస్తున్నారు చిత్ర టీమ్ వాళ్లు.

సడెన్ గా ఈ రోజు ప్రభాస్ 20వ చిత్రం టైటిల్ ప్రకటిస్తామని.. జూలై 10న 10 గంటల 10 నిమిషాలకు ఫస్ట్ లుక్ రివీల్ చేస్తామని యూవీ క్రియేషన్స్ వారు తాజాగా అధికారింగా తెలిపారు. ఈ వార్త తెలిసిన డార్లింగ్ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. అప్పుడే సోషల్ మీడియా వేదికగా సందడి మొదలు పెట్టేసారు కూడా. రాష్ట్రంలో షూటింగులకు అనుమతి వచ్చింది.. షూటింగ్ ప్రారంభిస్తామని హైదరాబాద్ లో భారీ సెట్ కూడా వేశారు. త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానున్న ఈ సినిమాలో ప్రభాస్ జోడిగా పూజాహెగ్డే నటిస్తోంది. సీనియర్ నటి భాగ్యశ్రీ కీలక పాత్రలో కనిపించనుంది.