Breaking News

ప్రభాస్​ న్యూ ప్రాజెక్ట్​ ‘ఆదిపురుష్​’

యంగ్​రెబల్​ స్టార్​ ప్రభాస్​ తన 22వ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించేశాడు. ‘ఆదిపురుష్​’ అనే పాన్​ఇండియా మూవీలో తాను నటించబోతున్నట్టు అభిమానులకు సర్​ప్రైజ్​ ఇచ్చాడు. ఈ కొత్తచిత్రానికి ‘తనాజీ’ ఫేం ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్నారు. గుల్హన్​కుమార్​ , టీసీరిస్​వారు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మొత్తం 5 భాషల్లో ఈ చిత్రం తెరకెక్కునున్నట్టు సమాచారం. హిందీతోపాటు తెలుగు, తమిళ, కన్నడ, మళయాళ భాషల్లో ఈ సినిమా రిలీజ్​ కానున్నది. ‘ఆదిపురుష్​’ అనే ఈ చిత్రం ఇతిహాస కథ ఆధారంగా తెరకెక్కిస్తారా. . లేక సోషియో ఫాంటసీ చిత్రమా అన్న విషయం ఇంకా క్లారిటీ లేదు. ఇక ఇప్పటికే ప్రభాస్​ ‘రాధేశ్యామ్​’ అనే ఓ చిత్రంలో నటించనున్నారు. దాని తర్వాత నాగ్​అశ్విన్​ దర్శకత్వంలో మరో భారీచిత్రంలో నటిస్తున్నారు. వీటితోపాటు కేజీఎఫ్​ డైరెక్టర్​ ప్రశాంత్​నీల్​ చెప్పిన కథకు కూడా ప్రభాస్​ ఓకే చెప్పినట్టు సమాచారం. నాగ్​అశ్విన్​ సినిమా తర్వాత ఆదిపురుష్​ షూటింగ్​ ప్రారంభించవచ్చని సమాచారం. ఆదిపురుష్​ చిత్రాన్ని 3 డీ టెక్నాలజీలతో తెరకెక్కించనున్నారు. ఈ చిత్రంలో ప్రభాస్​ మహావిష్ణువుగా నటిస్తారని కొందరు, లేదు శివుడిగా నటిస్తున్నారని మరికొందరు అభిమానులు సోషల్​మీడియాలో పోస్టులు పెడుతున్నారు.