న్యూఢిల్లీ: దేశంలో కరోనా సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఏర్పాటుచేసిన ‘పీఎం కేర్స్’ నిధికి మోడీ రూ. 2.25 లక్షల విరాళమిచ్చారు. ఈ నిధికి వచ్చిన విరాళాలపై వివాదం తలెత్తిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రెండు రోజుల క్రితం ఆ వివరాలను వెల్లడించిన విషయం విదితమే. పీఎం కేర్స్ లో పారదర్శకత లోపించిందని విపక్షాలు మోడీ సర్కారుపై విమర్శలు చేసినా.. ఆ వివరాలను బహిర్గతం చేయాలని ఆర్టీఐ కింద దరఖాస్తుదారులు కోరినా దానికి బీజేపీ సర్కారు స్పందించలేదు. ఈ ఏడాది మార్చి 27న ఈ నిధిని ఏర్పాటు చేయగా.. రాజకీయ నాయకులు, కార్పొరేట్ సంస్థలు, పారిశ్రామికవేత్తలు పెద్దఎత్తున విరాళాలు ప్రకటించారు. కాగా, ఈ నిధిని ప్రకటించిన ఐదురోజుల్లోనే రూ.3,076 కోట్లు వచ్చినట్టు ‘పీఎం కేర్స్ ఫండ్’ వెబ్ సైట్ లో పేర్కొన్నారు. అయితే ఇప్పటివరకు పీఎం కేర్స్ కు వచ్చిన మొత్తం నిధులెన్నో మాత్రం వెల్లడించలేదు. ఇదిలాఉండగా, ప్రధాని మోడీ ఇప్పటివరకు వివిధ కార్యక్రమాల కోసం రూ.103 కోట్లు విరాళమిచ్చారు.
- September 3, 2020
- Archive
- Top News
- జాతీయం
- CENTRAL GOVT
- NARENDRAMODI
- PM CARES
- PRIME MINISTER
- కేంద్రప్రభుత్వం
- పీఎం కేర్స్
- ప్రధాని నరేంద్రమోడీ
- Comments Off on ప్రధాని మోడీ విరాళం రూ.2.25 లక్షలు