సారథి న్యూస్, ములుగు: కలెక్టరేట్ లో ప్రజల నుంచి సోమవారం విజ్ఞప్తులు స్వీకరించినట్లు ములుగు జిల్లా కలెక్టర్ ఎస్.క్రిష్ణ ఆదిత్య తెలిపారు. భూసమస్యలకు సంబంధించి 25, సదరం పెన్షన్లకు సంబంధించి మూడు, ఇతర శాఖలకు సంబంధించి మూడు .. మొత్తం 31 విజ్ఞప్తులు స్వీకరించినట్లు ఆయన తెలిపారు. కోవిడ్-19 నియంత్రణ దృష్ట్యా భౌతిక దూరాన్ని పాటించి, వచ్చిన దరఖాస్తులను శానిటైజేషన్ కు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. మాస్క్లు తప్పకుండా కట్టుకోవాలని, భౌతికదూరం పాటించాలని కలెక్టర్ సూచించారు.
- June 15, 2020
- తెలంగాణ
- లోకల్ న్యూస్
- MULUGU
- PRAJAVANI
- కలెక్టర్
- ప్రజావాణి
- ములుగు జిల్లా
- Comments Off on ప్రజావాణి వినతుల స్వీకరణ