సారథి న్యూస్, రామగుండం: పెద్దపల్లి జిల్లా రామగుండంలోని లక్ష్మీనగర్‌లో 2013లో ప్రభుత్వం నిర్మించిన షాపింగ్ కాంప్లెక్స్ నిరుపయోగంగా ఉందని.. దీంతో రూ. 7 కోట్ల ప్రజాధనం దుర్వినియోగం అవుతున్నదని సీపీఐ నేతలు ఆరోపించారు. ఆదివారం సీపీఐ నేతలు రామగుండంలో పర్యటించి ప్రభుత్వం నిర్మించిన షాపింగ్ కాంప్లెక్స్‌ను సందర్శించారు. సీపీఐ రామగుండం నగర కార్యదర్శి కనకరాజ్ మాట్లాడుతూ.. కేవలం కాంట్రాక్టర్లను బతికించడానికే షాపింగ్ కాంప్లెక్స్‌ను నిర్మించారని ఆరోపించారు. ఈ దుకాణ సముదాయం అసాంఘిక శక్తులకు అడ్డాగా మారిందని ఆరోపించారు. ప్రభుత్వం వెంటనే టెండర్లు పిలిచి అర్హులకు షాపులను కేటాయించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఐ నాయకులు మద్దెల దినేశ్, తలపల్లి మల్లయ్య, టీ రమేశ్‌కుమార్, వై లెనిన్, రేణికుంట్ల ప్రీతం, తలపల్లి సురేంద్ర, వనపాకల విజయ్, కే అవినాష్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
- July 5, 2020
- Archive
- కరీంనగర్
- లోకల్ న్యూస్
- CPI
- RAMAGUNDAM
- SHOPS
- దుర్వినియోగం
- షాపింగ్ కాంప్లెక్స్
- Comments Off on ప్రజాధనం దుర్వినియోగం