సారథి న్యూస్, హైదరాబాద్: ప్రజల కనీస అవసరాలు తీర్చడంపై దృష్టి పెట్టాలని మున్సిపల్, ఐటీశాఖ మంత్రి కె.తారకరామారావు ప్రజాప్రతినిధులు, అధికారులకు సూచించారు. కరీంనగర్, నిజామాబాద్ కార్పొరేషన్లలో మౌలిక సదుపాయాల కల్పనపై సోమవారం హైదరాబాద్లో సమీక్ష సమావేశం నిర్వహించారు. వానాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పారిశుద్ధ్యం, రోడ్ల నిర్వహణకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. మోడ్రన్ స్లాటర్ హౌస్ లు నిర్మించాలన్నారు. సమావేశంలో మంత్రులు గంగుల కమలాకర్, వేముల ప్రశాంత్ రెడ్డి ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, బి.గణేష్ గుప్తా, జీవన్ రెడ్డి, గోవర్ధన్ రెడ్డి పాల్గొన్నారు.
- June 8, 2020
- తెలంగాణ
- GANGULA
- KTR
- VEMULA
- కరీంనగర్
- నిజామాబాద్
- సీజనల్ వ్యాధులు
- Comments Off on ప్రజల కనీస అవసరాలు తీర్చండి