సారథి న్యూస్, వాజేడు, ములుగు: యాంత్రిక జీవన విధానంలో అలసిపోతున్న ప్రజలకు మానసిక ఉల్లాసాన్ని పొందేందుకు పల్లె ప్రకృతివనాలు ఎంతో దోహదపడతాయని ములుగు జిల్లా కలెక్టర్ ఎస్.క్రిష్ణఆదిత్య అన్నారు. సోమవారం ములుగు జిల్లా కేంద్రంలోని తంగేడు మైదానంలో నిర్మించిన పల్లె ప్రకృతివనాన్ని కలెక్టర్, ములుగు ఎమ్మెల్యే ధనసరి అనసూయ(సీతక్క)తో కలిసి ప్రారంభించారు. అన్ని పంచాయతీల్లో పల్లె ప్రకృతి వనాల నిర్మాణాలు తుదిదశకు చేరాయని వివరించారు. సేదదీరడానికి ఏర్పాటుచేసిన బెంచిలో కలెక్టర్, ఎమ్మెల్యేతో పాటు ప్రజాప్రతినిధులు కాసేపు కూర్చుని సేదదీరారు. కలెక్టర్ కు ములుగు సర్పంచ్బండారి నిర్మల హరినాథం ఘనస్వాగతం పలికారు. కార్యక్రమంలో డీఆర్డీవో పారిజాతం, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ రవి, డీఎల్పీవో దేవరాజు, ఎంపీపీ గండ్రకోట శ్రీదేవి సుధీర్ యాదవ్, జడ్పీటీసీ సకినాల భవాని, జడ్పీ కోఆప్షన్ నెంబర్ రియాజ్ మీర్జా, ఎంపీటీసీ గొర్రె సమ్మయ్య పాల్గొన్నారు.
- November 2, 2020
- Archive
- లోకల్ న్యూస్
- వరంగల్
- షార్ట్ న్యూస్
- MULUGU
- PRAKRUTHI VANAM
- SITHAKKA
- VAJEDU
- ప్రకృతి వనాలు
- ములుగు
- వాజేడు
- సీతక్క
- Comments Off on ప్రకృతి వనాలతో మానసిక ఉల్లాసం