టాలీవుడ్ ప్రఖ్యాత కామెడీ నటుడైన అలీ కొద్దిరోజులుగా ఫేస్బుక్, ట్విట్టర్లో తాను పెట్టని కమెంట్ల గురించి ఆశ్చర్యంలో ఉన్నారు. అందరూ ఆ ట్విట్టర్ అలీదే అనుకున్నారట కూడా. వాటి వల్ల తను ఇబ్బందులకు గురవుతున్నాడట. ‘వ్యక్తిత్వంలో నిన్ను ఓడించలేనప్పుడు నీ కులం, గుణం, వర్ణం గురించి మాట్లాడతారు.. ఎవరు ఎన్ని విధాలుగా విమర్శించినా చెదరని నీ నవ్వు నీ సహనానికి శిరస్సు వంచి నమస్కారాలు..’ అని అలీ పేరుతో ఓ ట్వీట్ రాగా.. దానికి ప్రతిగా పవన్ ఫ్యాన్స్ ఘాటుగా రిప్లై ఇవ్వడం తెలిసిందే. అయితే ఈ ట్వీట్‌లు తాను చేయలేదని, తన పేరుతో ఎవరో ట్వీట్‌లు చేస్తున్నారని, కొంత మందిని తన పేరు వాడుకుని దూషిస్తున్నారని అలీ శనివారం సైబరాబాద్ పోలీసులను ఆశ్రయించారు. తన పేరుపై ఫేక్ అకౌంట్‌ని వినియోగించి తనకు తెలియకుండానే టాలీవుడ్ స్టార్స్‌ని కొంత మందిని పొగుడుతూ.. కొంత మందిని విమర్శిస్తూ ట్వీట్‌లు పెడుతున్నారని వాపోయారు.. అంతేకాదు వారిపై వెంటనే యాక్షన్ తీసుకోవాలని, ఆ అకౌంట్‌ను వెంటనే బ్లాక్ చేయించాలని సైబర్ క్రైమ్ అధికారి రోహిణికి కంప్లైంట్ ఇచ్చారు అలీ.
- July 19, 2020
- Archive
- సినిమా
- ALI
- CYBERCRIME
- FACEBOOK ACCOUNT
- TWEET
- అలీ
- ట్వీట్
- సైబర్‌క్రైమ్
- Comments Off on పోలీస్ స్టేషన్‌కు అలీ