సారథి న్యూస్, మెదక్: బడ్జెట్ ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రభుత్వం పేదవారికి ఇబ్బందులు రాకుండా అనేక పథకాలను ప్రవేశపెడుతుందని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి అన్నారు. రైతులు ఆర్థికంగా ఎదగడం కోసం ప్రభుత్వం కృషిచేస్తోందని వివరించారు. బుధవారం మెదక్ జిల్లా పాపన్నపేటలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో దరఖాస్తుదారులకు 153 కళ్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం మండలంలోని 36 ఈ పంచాయతీలకు కంప్యూటర్లను అందజేశారు. కరోనాకు బయపడాల్సిన అవసరం లేదని, సామాజిక దూరం పాటించాలని సూచించారు. గ్రామాల్లో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ నగేష్, జడ్పీటీసీ సభ్యురాలు షర్మిల, మండల రైతు సమన్వయ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
- August 19, 2020
- Archive
- మెదక్
- లోకల్ న్యూస్
- DEVENDARREDDY
- EPANCHAYATHI
- medak
- PADMA
- ఈపంచాయతీలు
- పద్మాదేవేందర్రెడ్డి
- మెదక్
- Comments Off on పేదల సంక్షేమమే ధ్యేయం