Breaking News

పేదలు, కార్మికులను ఆదుకుంటాం

పేదలకు సరుకులు పంపిణీచేస్తున్న మేయర్ బొంతు రామ్మోహన్

సారథి న్యూస్, హైదరాబాద్: కరోనా వ్యాప్తి.. లాక్డౌన్ నేపథ్యంలో పేదలు, కార్మికులకు సీఎం కేసీఆర్ అండగా నిలిచారని హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహన్ అన్నారు. ఆదివారం చర్లపల్లి డివిజన్ లో స్టేట్ సివిల్ సప్లయీస్ సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్రెడ్డి, ఎమ్మెల్యే భేతి సుభాష్రెడ్డి, మేడ్చల్ జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లుతో కలిసి వలస కూలీలకు 12 కేజీల బియ్యం, రూ.500 నగదు చొప్పున మేయర్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఓ ఒక్కరూ కష్టకాలంలో ఆకలితో ఇబ్బందిపడకూడదనే సంకల్పంతో పేదల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందన్నారు.