సారథి న్యూస్, శ్రీకాకుళం: నిరుపేదల జీవితాల్లో వెలుగులు నింపడానికే ‘జగనన్న చేదోడు’ కార్యక్రమం చేపట్టామని ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి వివరించారు. బుధవారం వీడియోకాన్ఫరెన్స్ ద్వారా కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. టైలర్ వృత్తిదారులు, నాయీ బ్రాహ్మణులు, రజకుల ఆర్థిక కష్టాలను పాదయాత్రలో తెలుసుకున్నానని వివరించారు. ప్రతి కుటుంబానికి రూ.10 వేలు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. అర్హులు ఏ ఒక్కరూ మిస్ కాకూడదని సూచించారు. జూలై 8న ఇళ్లపట్టాలను పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. సమావేశంలో స్పీకర్ తమ్మినేని సీతారాం, మంత్రి ధర్మాన కృష్ణదాస్, మాజీ కేంద్రమంత్రి కిల్లి కృపారాణి, జిల్లా కలెక్టర్ జె.నివాస్, బీసీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జి.రాజారావు పాల్గొన్నారు.
- June 10, 2020
- Top News
- ఆంధ్రప్రదేశ్
- AP
- CM JAGAN
- జగనన్న చేదోడు
- శ్రీకాకుళం
- Comments Off on పేదలకు ‘జగనన్న చేదోడు’