సారథి న్యూస్, నారాయణపేట: నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలం క్యాతన్‌పల్లి గ్రామానికి చెందిన నాగప్ప గ్రామంలోని సర్వేనం.230, 225, 248లో 4.20 ఎకరాల భూమి కాస్తులో ఉన్నారు. కాగా, ఈ భూమి గ్రామానికి చెందిన ప్రభాకర్ రావు పేర పట్టా ఉంది. ప్రభాకర్ రావు మృతి చెందడంతో ఆయన కొడుకు గంగాసాగర్ రావు విరాసత్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. కాగా, కొన్నేళ్లుగా తామే కాస్తులో ఉండి పంటలు సాగు చేస్తున్నామని, తమకు పట్టా అమలుచేసి ఇవ్వాలని గంగాసాగర్రావును నాగప్ప కోరుతున్నాడు. కాస్తులో ఉన్న నాగప్పను భూమి కాస్తులో ఉన్నట్టు లేదా కొన్నట్లు ఆధారాలు చూపితే పట్టా చేస్తానంటూ తెలిపినట్లు సమాచారం. ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో కాస్తులో ఉన్నా కూడా.. పట్టా కావడం లేదని తీవ్ర మనస్తాపానికి గురైన నాగప్ప తన కుమారుడు రాజుతో కలిసి పురుగు మందు తాగి నారాయణపేట కలెక్టరేట్ ఎదుట ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.
- August 31, 2020
- Archive
- Top News
- మహబూబ్‌నగర్
- DAMARAGIDDA
- FORMERS SUICIDE ATTEMPT
- KYATHANPALLY
- NARAYANAPETA
- ఇద్దరు రైతులు
- క్యాతన్‌పల్లి
- దామరగిద్ద
- నారాయణపేట
- Comments Off on ‘పేట’ కలెక్టరేట్ ఎదుట కలకలం