Breaking News

పెళ్లిపై జేజమ్మ క్లారిటీ

జేజమ్మ అనుష్క వివాహం గురించి ఎప్పట్నుంచో వార్తలు వస్తున్నాయి. యంగ్ రెబల్‌ బ్యూటీ స్టార్ పెళ్లిపీటలు ఎక్కనుందని ఆమధ్య వార్తలు వచ్చాయి. వాటిని వారిద్దరూ ఖండించారు. ఆ తర్వాత ఉత్తరాదికి చెందిన ఓ క్రికెటర్‌తో అనుష్క ప్రేమయాణం సాగిస్తోందని, త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని టాక్ వచ్చింది. ఆ టాక్‌ను కూడా అనుష్క స్వయంగా ఖండించింది. అనుష్క పెళ్లి చేసుకోబోయే వ్యక్తి ఇతనేనంటూ తాజాగా మరో పేరు తెరమీదకు వచ్చింది.

పెళ్లిపై జేజమ్మ క్లారిటీ

టాలీవుడ్‌కు చెందిన ఓ ప్రముఖ దర్శకుడి కొడుకుతో అనుష్క పెళ్లంటూ గాసిప్స్​ వస్తున్నాయి. ఈ వార్తలపై కూడా అనుష్క ఇటీవల రియాక్ట్ అయింది. అనవసరంగా తన వ్యక్తిగత జీవితంలోకి చొరబడొద్దని సూచించింది. ‘నా పెళ్లి గురించి కొన్ని రోజులుగా వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజమూ లేదు. అవన్నీ అవాస్తవాలు. అయినా నా పెళ్లి గురించి అందరూ ఇంతలా ఎందుకు మాట్లాడుకుంటున్నారో అర్థం కావడం లేదు. ఒకవేళ నేను పెళ్లి చేసుకోవాలనుకుంటే.. దాన్ని రహస్యంగా ఎందుకుంచుతాను. వివాహం జరిగిన రోజున తప్పకుండా ప్రజలకు తెలుస్తుందని’ అనుష్క చెప్పింది.