సారథిన్యూస్, గోదావరిఖని: కేంద్రప్రభుత్వం బీద, మధ్య తరగతి ప్రజలను దోచుకొని ధనికులకు పంచిపెడుతున్నదని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కలివెన శంకర్ పేర్కొన్నారు. శనివారం పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలంటూ సీపీఐ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. గోదావరిఖని పట్టణంలో ఓ కారుకు తాళ్లను కట్టి దాన్ని నెట్టుకుంటూ వెళ్లి వినూత్న రీతిలో సీపీఐ శ్రేణులు నిరసన తెలిపాయి. అనంతరం సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కలవెన శంకర్ మాట్లాడుతూ.. అంతర్జాతీయ చమురు ధరలు తగ్గుముఖం పట్టినా కేంద్ర ప్రభుత్వం పెట్రో ధరలను పెంచుతున్నదని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నాయకులు తాండ్ర సదానందం, నారాయణ, కే కనకరాజ్, మల్లయ్య, దినేశ్, ఎల్లయ్య, గౌతమ్ గోవర్ధన్, ఎల్ ప్రకాష్, కందుకూరి రాజరత్నం, టీ రమేష్ కుమార్, రాజమొగిలి, రాజయ్య, మడి కొండ ఓదెమ్మ, రమ, రేణికుంట్ల ప్రీతం, వనాపకల విజయ్, ఎర్రల రాజయ్య, జనగామ మల్లేష్, కనకయ్య, పరమాత్మ పాల్గొన్నారు.
- June 20, 2020
- Archive
- కరీంనగర్
- లోకల్ న్యూస్
- AGITATION
- CPI
- GOVERNMENT
- PETROL
- గోదావరిఖని
- ప్రజలు
- Comments Off on పెట్రో ధరలను తగ్గించండి