సారథి న్యూస్, హుస్నాబాద్: పెంచిన పెట్రోధరలను వెంటనే తగ్గించాలని సీపీఐ కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి డిమాండ్ చేశారు. కరీంనగర్ జిల్లా హుస్నాబాద్‌లో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కరోనా అంతకంతకూ పెరుగుతున్నా.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోకుండా ప్రజారోగ్యాన్ని గాలికొదిలాయని మండిపడ్డారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరికి నిరసనగా ఈ నెల 25న సీపీఐ ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఆందోళనలు చేపడుతున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కంట్రోల్ కమిషన్ సభ్యులు ఎడ్ల వెంకట్రామిరెడ్డి, సీపీఐ జిల్లా కార్యదర్శి మంద పవన్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు గడిపె మల్లేశ్, నాయకులు సత్యనారాయణ, బాలమల్లు, వనేష్, వెంకటరెడ్డి, శంకర్, అశోక్, సంజీవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
- June 24, 2020
- Archive
- కరీంనగర్
- లోకల్ న్యూస్
- CPI
- DHARNA
- DIESEL
- PETROL
- చాడ వెంకట్‌రెడ్డి
- డిమాండ్
- Comments Off on పెట్రోధరలు తగ్గించండి