భోపాల్: కరోనా విస్తరిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో మధ్యప్రదేశ్ ప్రభుత్వం కీలకనిర్ణయం తీసుకున్నది. రాష్ట్రంలో పెండ్లి వేడుకలకు కేవలం 20 మంది మాత్రమే హాజరకావాలని ఆదేశాలు జారీచేసింది. ఇంట్లో జరిగే పుట్టినరోజు తదితర వేడుకలకు 10 మంది మాత్రమే హాజరు కావాలని ఆదేశాల్లో పేర్కొన్నది. ఈ ఆదేశాలను ఎవరు ఉల్లంఘించినా కఠినచర్యలు తీసుకుంటుమాని పేర్కొన్నది. రాష్ట్రంలో ఎటువంటి మతపరమైన కార్యక్రమాలు చేయకూడదని.. బహిరంగ ప్రదేశాల్లో 5 కంటే ఎక్కువమంది ఓకే చోట గుమికూడదని పేర్కొన్నది. కరోనా విస్తరిస్తున్న ప్రస్తుతతరుణంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.
- July 15, 2020
- Archive
- జాతీయం
- షార్ట్ న్యూస్
- BHOPAL
- CARONA
- MADYAPRADESH
- NEWCASES
- RULES
- ప్రభుత్వం
- మధ్యప్రదేశ్
- Comments Off on పెండ్లికి 20మందికే అనుమతి