Breaking News

పూర్ణను బెదిరించింది ఎవరు?

తనను కొందరు బెదిరిస్తున్నారంటూ టాలీవుడ్​ నటి పూర్ణ పోలీసులను ఆశ్రయించారు. లాక్ డౌన్‌తో ఆమె కొన్ని రోజులుగా సొంత రాష్ట్రమైన కేరళలోనే ఉంటున్నారు. అయితే ఓ నలుగురు వ్యక్తులు సోషల్​మీడియా ద్వారా ఆమెను బెదిరించారు. ఏ విషయంలో బెదిరించారన్న విషయం ఆమె స్ఫష్టంగా చెప్పడం లేదు. నలుగురు వ్యక్తలు తనను డబ్బుల కోసం బెదిరిస్తున్నారని ఆమె కుటుంబసభ్యులతో కలిసి సైబర్​క్రైం పోలీసులను ఆశ్రయించారు. రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టి డబ్బులు డిమాండ్ చేస్తున్న నలుగురు సభ్యుల ముఠాను అరెస్ట్ చేశారు.