సారథి న్యూస్, రామయంపేట: రైతులకు యాసంగి సీజన్ లో అవసరమైన ఎరువులను పీవోఎస్ మిషన్ల ద్వారానే విక్రయించాలని మెదక్ డీఏవో పరుశురాం నాయక్ ఫర్టిలైజర్ దుకాణాల యజమానులకు సూచించారు. శనివారం మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని పలు ఫర్టిలైజర్ షాపులను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దుకాణాల వద్ద స్టాక్ వివరాలు, ధరల పట్టికలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. నకిలీ, కాలం చెల్లిన పురుగు మందులను విక్రయించొద్దని హెచ్చరించారు. చలి నుంచి వరి నారు మళ్లను ఎలా కాపాడుకోవాలో రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. ఆయన వెంట మండల అగ్రికల్చర్ ఆఫీసర్ సతీశ్, ఏఈఓలు ఉన్నారు.
- January 2, 2021
- Archive
- మెదక్
- లోకల్ న్యూస్
- AGRICULTURE OFFICERS
- POS MICHINES
- RAMAYAMPET
- పీవోఎస్ మిషన్లు
- యాసంగి సీజన్
- రామాయంపేట
- వ్యవసాయశాఖ
- Comments Off on పీవోఎస్ మిషన్లతోనే ఎరువులు అమ్మాలి