హైదరాబాద్: దేశవ్యాప్తంగా ఉన్న జవహర్ నవోదయ విద్యాలయాల్లో (జేఎన్‌వీ) వచ్చే విద్యాసంవత్సరానికి 6వ తరగతిలో ప్రవేశ ప్రక్రియ ప్రారంభమైంది. దీనికి సంబంధించి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని జేఎన్‌వీఎస్ వెల్లడించింది. అధికారిక వెబ్‌సైట్ www.navodaya.gov.inలో డిసెంబర్ 15 వరకు దరఖాస్తులు అందుబాటులో ఉంటాయని తెలిపింది. ప్రవేశ పరీక్షను 2021 ఏప్రిల్ 10న ఉదయం 11.30 గంటలకు దేశంలోని అన్ని జవహర్ నవోదయ విద్యాలయాల్లో నిర్వహించనున్నట్లు వెల్లడించింది. పరీక్ష ఫలితాలను 2021 జూన్ నెలలో ప్రకటిస్తారు.
ఎవరెవరు అర్హులు?
జవహర్ నవోదయ విద్యాలయ పాఠశాలలు ఉన్న జిల్లా పరిధిలోని విద్యార్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. అదేవిధంగా విద్యార్థులు 2008, మే 1 నుంచి 2012, ఏప్రిల్ 30 మధ్య జన్మించినవారై ఉండాలి. ప్రభుత్వ గుర్తింపు పొందిన స్కూళ్లలో ప్రస్తుత విద్యాసంవత్సరంలో 5వ తరగతి చదువుతున్నవారు అర్హులు. గ్రామీణ ప్రాంతానికి చెందిన పేద విద్యార్థులకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి.
పరీక్ష విధానం
రాతపరీక్ష కాలవ్యవధి మొత్తం 2 గంటలు (ఉదయం 11.30 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు) ఉంటుంది. ఇందులో మూడు సెక్షన్లు ఉంటాయి. మొత్తం 80 ప్రశ్నలకు 100 మార్కులకు ఉంటాయి.
మెంటల్ ఎబిలిటీ టెస్ట్ – 40 ప్రశ్నలు – 50 మార్కులు – 60 నిమిషాలు
ఆర్థమెటిక్ టెస్ట్ – 20 ప్రశ్నలు- 25 మార్కులు – 30 నిమిషాలు
లాంగ్వేజ్ టెస్ట్ – 20 ప్రశ్నలు – 25 మార్కులు – 30 నిమిషాలు
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్
దరఖాస్తులు ప్రారంభం: నవంబర్ 5
దరఖాస్తులకు చివరి తేదీ: డిసెంబర్ 15
రాత పరీక్ష: 2021ఏప్రిల్ 10
పరీక్ష ఫలితాలు: జూన్, 2021
వెబ్‌సైట్: www.navodaya.gov.in
- November 6, 2020
- Archive
- స్టడీ
- JNVS
- MENTALABILITY
- NAVODAYA VIDYASAMITHI
- TELANGANA
- జవహర్
- జేఎన్‌వీఎస్
- నవోదయ విద్యాలయం
- Comments Off on పిలుస్తోంది.. నవోదయ విద్యాలయం