Breaking News

పింక్ బాల్​ టెస్ట్ కోసం వెయిటింగ్

  • ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్

న్యూఢిల్లీ: భారత్​తో జరిగే పింక్ బాల్ టెస్ట్ ( డే నైట్) కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నానని ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్ అన్నాడు. ఈ మ్యాచ్​లో పైచేయి సాధించేందుకు తాము అన్ని రకాల అస్ర్తాలను ప్రయోగిస్తామన్నాడు. ఈ ఏడాది చివరిలో ఆసిస్​లో పర్యటించే టీమిండియా.. నాలుగు టెస్ట్​ల సిరీస్ ఆడనుంది. ఇందులో ఒకటి డే నైట్ మ్యాచ్ ఆడతామని గతంలోనే గంగూలీ హామీ ఇచ్చాడు.

‘భారత్​తో సిరీస్​లో పింక్ బాల్ మ్యాచ్ ఉండడం చాలా గొప్ప విషయం. ఆ మ్యాచ్ సిరీస్ మొత్తానికే హైలెట్​గా నిలుస్తుంది. బ్యాట్, బంతికి మధ్య రసవత్తరమైన పోటీ జరుగుతుంది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. టీమిండియా ఇప్పటికీ ఒకే ఒక మ్యాచ్ ఆడింది. కానీ మాకు చాలా అనుభవం ఉంది. ఇది మాకు అదనపు ప్రయోజనంగా మారుతుంది. సొంత గడ్డపై డే నైట్ టెస్ట్​లో మా రికార్డు కూడా చాలా బాగుంది. దీనిని అందుకోవడం ఇప్పట్లో ఎవరికీ సాధ్యం కాకపోవచ్చు’ అని స్టార్క్ వివరించాడు.