Breaking News

పార్లమెంట్ భవనాన్ని కూల్చేస్తాం : కేంద్రం

పార్లమెంట్ భవనాన్ని కూల్చేస్తాం : కేంద్రం

న్యూఢిల్లీ : ప్రస్తుత పార్లమెంట్ భవనం పురాతనమైందని, దాన్ని కూల్చేస్తామని కేంద్రం ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం మంగళవారం సుప్రీంకోర్టులో ఓ అఫిడవిట్‌ను దాఖలు చేసింది. ప్రస్తుత పార్లమెంట్ భవనం 100 ఏళ్ల పురాతన భవనమని, భద్రతాపరంగా చాలా ఇబ్బందులు తలెత్తుతున్నాయని కేంద్రం పేర్కొంది. అంతేకాకుండా ఏవైనా తీవ్రమైన అగ్నిప్రమాదాలు సంభవిస్తే కూడా కష్టమేనని ఆ అఫిడవిట్‌లో తెలిపింది. అందుకే ఇదే స్థలంలో నూతన పార్లమెంట్ భవనాన్ని నిర్మిస్తామని కేంద్రం తెలిపింది. ‘ఈ భవనాన్ని 1921 లో భవన నిర్మాణం ప్రారంభమై..1937 లో  ముగిసింది. ఇప్పటికీ దాదాపు వందేళ్లు గడిచాయి. ఇప్పటికే ఇందులో చాలా సమావేశాలు జరిగాయి. కాబట్టి.. ప్రస్తుత అవసరాలు, సాంకేతికతకు ఈ భవనం సరిపోదు’ అని కేంద్రం పేర్కొంది.