ఆయనో ప్రజాప్రతినిధి.. తమ సమస్యలను పరిష్కరిస్తాడని, తమ కష్టాలను తీరుస్తాడని ప్రజలు ఓట్లేసి గెలిపించుకున్నారు. కానీ పార్లమెంట్‌కు వెళ్లిన సదరు ఎంపీ అశ్లీల వీడియోలు చూస్తూ మీడియాకు అడ్డంగా దొరికారు. అదృష్టవశాత్తు ఆయన మనదేశపు ఎంపీ కాదు. థాయిలాండ్ చోన్బూరి ప్రావిన్స్ ఎంపీ రోన్నాథెప్ అనువత్. గురువారం థాయిలాండ్ పార్లమెంట్లో బడ్జెట్ ప్రసంగంపై చర్చ జరుగుతున్నది. ఎంపీ గారికి బడ్జెట్ ప్రసంగం బోర్‌కొట్టినట్టుంది. వెంటనే ఫోన్ తీసి బూతు వీడియోలు ఓపెన్ చూశాడు. తాను పార్లమెంట్లో ఉన్నానని.. మీడియా ప్రతినిధులు తనపై ఓ కన్నేశారని ఊహించలేకపోయాడు. చివరకు అడ్డంగా దొరికిపోయి ప్రజలతో చీత్కారాలు తిన్నాడు. దాదాపు 10 నిమిషాల పాటు ఫోన్‌లో ఆ వీడియోలు చూస్తూనే ఉన్నాడు. కరోనా నిబంధలను ఉల్లంఘించి మాస్క్ తీసి మరి వీడియోలు చూడటంలో నిమగ్నమయ్యాడు. తర్వాత ఈ విషయాన్ని మీడియా ప్రతినిధులు ఆయన ముందు ప్రస్తావించారు. దానికి ఆయన సమాధానం ఏమిటంటే.. ‘నాకు ఓ మహిళ లైవ్ యాప్‌ద్వారా కనెక్ట్ అయ్యింది. ఆమెకు ఎదో ఇబ్బంది ఉందని చెప్పింది. ఆ ఇబ్బంది ఏమిటో తెలుసుకొనేందుకు నేను ఫోన్ వాడాను’ అంటూ బుకాయించాడు.