సారథి న్యూస్, ఖమ్మం: రానున్న ఖమ్మం, వరంగల్, నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక సన్నాహక సమావేశంలో భాగంగా పాలేరు నియోజకవర్గ స్థాయి సమావేశం ఆదివారం నాయుడుపేటలోని రామలీల ఫంక్షన్ హాల్ లో నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పార్టీ శ్రేణులతో మాట్లాడారు. పార్టీ గెలుపే లక్ష్యంగా ప్రతిఒక్కరూ పనిచేయాలని పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్నిర్ణయించిన అభ్యర్థి ఎవరైనా తమ వంతుగా గెలిపించుకోవాలని పాలేరు ఎమ్మెల్యే కందుల ఉపేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి నూకల నరేష్ రెడ్డి, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, వేణు, మద్దినేని బేబీ, స్వర్ణకుమారి పాల్గొన్నారు.
- September 20, 2020
- Archive
- ఖమ్మం
- లోకల్ న్యూస్
- CM KCR
- MLC ELECTIONS
- PUVVADA AJAY
- ఎమ్మెల్సీ ఎన్నికలు
- పువ్వాడ అజయ్
- సీఎం కేసీఆర్
- Comments Off on పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేయాలి