సారథి న్యూస్, కర్నూలు: మానవాళిని వణికిస్తున్న కరోనా విజృంభిస్తున్న సమయంలో సేవలందిస్తున్న పారిశుద్ధ్య కార్మికులను కర్నూలు నగర పాలక సంస్థ కమిషనర్ డీకే బాలాజీ ఘనంగా సత్కరించారు. సోమవారం ఉదయం ఎన్.ఆర్.పేటలోని ఆరవ శానిటరీ డివిజన్ కార్యాలయంలో ఇద్దరు కార్మికుల చేత కేక్ కట్ చేయించారు. కోవిడ్ నియంత్రణకు తమ ప్రాణాలను ఫణంగా పెట్టి విధులు నిర్వర్తిస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు ఇకపై ప్రతినెలా చివరి రోజున ఆ నెలలో వచ్చే పారిశుద్ధ్య కార్మికుల జన్మదిన వేడుకలను నిర్వహిస్తామని కమిషనర్ ప్రకటించారు. కేక్ కట్ చేస్తున్న సమయంలో కొందరు కార్మికులు ఆనందంతో ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. తమ గురించి ఆలోచించే అధికారి తమకు దొరకడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నామనిహర్షం వ్యక్తం చేశారు. అనంతరం కార్మికులకు వస్త్రాలు, సబ్బులు, నూనెలు, శానిటైజర్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ భాస్కర్ రెడ్డి, శానిటరీ సూపర్ వైజర్ నాగరాజు పాల్గొన్నారు.
- August 31, 2020
- Archive
- కర్నూలు
- లోకల్ న్యూస్
- APPRECIATIONS
- CARONA
- COMMISSINOR
- Kurnool
- కమిషనర్
- కరోనా
- కర్నూలు
- పారిశుద్ధ్య కార్మికులు
- సత్కారం
- Comments Off on పారిశుద్ధ్య కార్మికులకు సత్కారం