గ్లామర్ కే కాదు నటనకు కూడా ఇంపార్టెన్స్ ఇచ్చే పాయల్ రాజ్పుత్‘ఆర్ ఎక్స్ 100, ఆర్‌డీఎక్స్ లవ్, డిస్కోరాజా’ వంటి సినిమాల్లో గ్లామరస్ రోల్స్ చేసినా నటిగా కూడా మంచి గుర్తింపు పొందింది. ఇప్పడు ఆమె ప్రధానపాత్రగా వస్తున్న చిత్రం ‘అనగనగా ఓ అతిథి’. ఇందులో పాయల్ డీ గ్లామరస్ రోల్ చేస్తోంది. దయాళ్పద్మనాభన్ దర్శకుడు. చైతన్య కృష్ణ, ఆనంద్ చక్రపాణి, వీణ సుందర్‌కీలక పాత్రల్లో నటించారు. రాజా రామామూర్తి, చిందబర్ నటీశన్ నిర్మాతలు. ఈ మూవీ ట్రైలర్ ను వెంకటేష్ సోషల్ మీడియా వేదికగా లాంచ్ చేస్తూ.. ఊహించని థ్రిల్లర్ తో ట్రైలర్ ఉందంటూ ట్వీట్ చేశారు. ‘ఆశ అనే అగాధం..ఆశే ఆశే..అత్యాశే!’ అంటూ సాంగ్ తో ట్రైలర్ మొదలవుతుంది. ‘మన కష్టాలన్నీ తీరడానికి ఒకటే దారుంది.. వాడి చావు మన చేతుల్లోనే ఉంది. అది విధి’ అంటూ పాయల్ చెప్పే డైలాగ్ ఆకట్టుకుంటుంది. పాయల్ రాజ్ పుత్ ‘మల్లిక’ అనే సాధారణ యువతిగా కనిపించడంతో పాటు కొంత నెగిటివ్ షేడ్ ఉన్న రోల్ చేసినట్టు తెలుస్తోంది. సస్పెన్స్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమా ‘ఆహా’ ఓటీటీలో ఈ నెల 20న విడుదల కానుంది.
- November 18, 2020
- Archive
- సినిమా
- AHA
- OTT
- PAYALARAJPUTH
- RDXLOVE
- ఆర్‌డీఎక్స్ లవ్
- ఆహా
- ఓటీటీ
- పాయల్ రాజ్పుత్
- Comments Off on పాయల్.. ట్రైలర్ టాక్