Breaking News

పవర్​హౌస్ ​దుర్ఘటనపై లోతైన విచారణ

పవర్​హౌస్​దుర్ఘటనపై లోతైన విచారణ

సారథి న్యూస్​, హైదరాబాద్​: శ్రీశైలం జలవిద్యుత్ కేంద్రంలోకి బయట నుంచి వాటర్ వచ్చే అవకాశమే లేదని జెన్​కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్ రావు స్పష్టం చేశారు. ఈనెల 20న వపర్​హౌస్​లో జరిగిన ప్రమాదంపై విచారణ కమిటీ లోతుగా దర్యాప్తు చేస్తోందని తెలిపారు. ఈ ఘటనలో ఏడుగురు ఇంజనీర్లు, ఇద్దరు ఒక బ్యాటరీ కంపెనీ ప్రతినిధులు మరణించడం చాలా బాధాకరమన్నారు. అగ్నిప్రమాదం సమయంలో యూనిట్స్ ట్రిప్ కావలసి ఉంటుంది.. కానీ ఎందుకు ఆటోమేటిక్ గా ట్రిప్ కాలేదో విచారణ జరిపిస్తామన్నారు. ఘటన జరిగిన కొద్దిగంటల్లోనే తనతో పాటు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్వర్​రెడ్డి సంఘటన స్థలానికి చేరుకున్నామని వివరించారు. రాత్రి మొత్తం రెస్క్యూ ఆపరేషన్ చేసినట్టు చెప్పారు. తమ నుంచి సాధ్యం కాకపోవడంతో ఎన్​డీఆర్​ఎఫ్​ బృందాలను పిలిపించినట్టు వెల్లడించారు. అగ్నిప్రమాదంతో పవర్ కట్ అయిందని, లోపల అంధకారంగా మారిందని వివరించారు. అంతేకాదు ఎమర్జెన్సీ తలుపులు కూడా తెలుసుకోలేదని తెలిపారు. నెలరోజుల నుంచి ప్రతిరోజు 128 మెగావాట్స్ విద్యుదుత్పత్తి జరుగుతుందని తెలిపారు. గతంలో కూడా ఎండీపీసీలో బాయిలర్ బ్లాస్ట్ అయి 30 మంది చనిపోయారని అన్నారు. తమిళనాడులో కూడా ఇలాంటి ఘటనే జరిగిందని వివరించారు. మున్ముందు ఇలాంటి దుర్ఘటనలు చోటుచేసుకోకుండా అన్ని జాగ్రత్త చర్యలు తీసుకుంటామని వివరించారు.