క్రిష్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్ ఓ విభిన్న చిత్రంలో నటిస్తున్న విషయంలో తెలిసిందే. ఈ చిత్రానికి విరూపాక్ష అనే టైటిల్ను ఖరారు చేసినట్టు సమాచారం. కాగా తొలిసారిగా పవన్ కల్యాణ్ చిత్రానికి కీరవాణి సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో కేవలం రెండే పాటలు ఉంటాయట. అవి కూడా రెగ్యులర్ పాటల లాగా కాకుండా బ్యాక్గ్రౌండ్బీట్లుగా వస్తాయని సమాచారం. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించనున్నట్టు టాక్. ఈ సినిమా కోసం కీరవాణి కొత్త తరహా మ్యూజిక్ ని వినిపించబోతున్నట్టు తెలుస్తున్నది. మరి సినిమా ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుందోనని ఫాన్స్ ఎదురుచూస్తున్నారు.
- June 25, 2020
- Archive
- సినిమా
- KIRAVANI
- KRISH
- PAWAN
- VIRUPAKSHA
- కీరవాణి
- సంగీతం
- Comments Off on పవన్ కొత్త సినిమాలో రెండే పాటలు