సారథి న్యూస్ నారాయణఖేడ్: సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గం కంగ్టి మండలం చాప్టా(కే) గ్రామ ప్రజల దాహం తీరింది. ఈ గ్రామంలో తాగునీరు లేక చాలా కాలంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో గ్రామంలోని బారడీ పొచమ్మ గుడివద్ద సర్పంచ్ బోర్ వేయించారు. ఈ బోర్లో రెండు ఇంచులు నీరు పడటంతో గ్రామస్థుల దాహం తీరినట్టైంది. బుధవారం ఓ బోర్‌కు మోటర్ బిగించారు. కార్యక్రమంలో సర్పంచ్ సవిత బసప్ప, ఉప సర్పంచ్ బీ రాజు, వార్డు మెంబర్లు, యువకులు పాల్గొన్నారు.
- June 17, 2020
- Archive
- మెదక్
- లోకల్ న్యూస్
- MOTOR
- SANGAREDDY
- VILLAGE
- WATER
- గ్రామం
- గ్రామస్థులు
- Comments Off on పల్లె ప్రజల దాహం తీరింది