సారథి న్యూస్, హుస్నాబాద్: ‘పరిహారం చెల్లించాకే పనులు చేపట్టండి’ అంటూ గౌరవెల్లి ప్రాజెక్టు నిర్వాసితులు బుధవారం ప్రాజెక్టు పనులను అడ్డకున్నారు. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గౌరవెల్లి ప్రాజెక్టు కట్ట పనులను చేసేందుకు వచ్చిన కాంట్రాక్టర్లను భూ నిర్వాసితులు అడ్డుకున్నారు. ప్రాజెక్టు కింద ముంపునకు గురవుతున్న కుటుంబాలకు ఇండ్లు, ఇండ్ల స్థలాలతో పాటు పునరావాస ప్యాకేజీ పరిహారం అందిస్తామని అధికారులు సంతకాలు చేయించుకొని సంవత్సరం కావస్తున్నా, నేటికి ఒక్క పైసా ఇవ్వలేదని మండిపడ్డారు.
- July 8, 2020
- Archive
- మెదక్
- లోకల్ న్యూస్
- షార్ట్ న్యూస్
- GOURAVELLI
- HUSNABAD
- PROJECT
- SIDDIPET
- పరిహారం
- సిద్దిపేట
- Comments Off on పరిహారం ఇస్తేనే పనులు చేయనిస్తం