సారథి న్యూస్, ములుగు: ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ములుగు జిల్లా కలెక్టర్ ఎస్.క్రిష్ణ ఆదిత్య కోరారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా పరిశ్రమల ప్రమోషన్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సెర్ప్ ద్వారా జిల్లాలో పరిశ్రమల స్థాపనకు ఆర్థిక స్తోమత ఉన్నవారిని గుర్తించి ప్రభుత్వపరంగా పరిశ్రమల స్థాపనకు సహకరించాలన్నారు. జనాభాపరంగా అన్ని సామాజికవర్గాలకు లబ్ధి చేకూరాలన్నారు. టీ-ప్రైడ్ పథకం ద్వారా 8 దరఖాస్తులు రాగా, ఏడింటిని పరిశీలించి ఆమోదించినట్లు తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్(స్థానిక సంస్థలు) ఆదర్శ్ సురభి, జిల్లా పరిశ్రమల అధికారి శ్రీనివాస్, ఎల్డిఎం ఆంజనేయులు, ఏఎంవీఐ రాజశేఖర్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఏఈ అజయ్ పాల్గొన్నారు.
- October 9, 2020
- Archive
- లోకల్ న్యూస్
- వరంగల్
- KRISHNA ADITYA
- MULUGU
- SERP
- TPRIDE
- కలెక్టర్ ఎస్.క్రిష్ణ ఆదిత్య
- టీ-ప్రైడ్
- ములుగు
- సెర్ప్
- Comments Off on పరిశ్రమల స్థాపనకు ప్రోత్సాహం