సారథిన్యూస్, రామడుగు: రైతులు కొన్ని జాగ్రత్తలు పాటించి వరి, పత్తి పంటలను ఆశిస్తున్న తెగుళ్లను అరికట్టవచ్చని కృషి విజ్ఞానకేంద్రం శాస్త్రవేత్తలు సూచించారు. మంగళవారం కరీంనగర్ జిల్లా రామడుగు మండలం శనగర్లో పత్తి, వరి పంటలను వారు పరిశీలించారు. పత్తిలో రసం పీల్చే పురుగులను గుర్తించారు. దీని నివారణకు గాను ఆసీపీట్2 గ్రా లీటర్ నీటి కి కలిపి పిచికారి చేయాలని సూచించారు. ఎండు తెగులు సోకితే కాపర్ ఆక్సీ క్లోరైడ్ లీటర్ మూడు గ్రాముల చొప్పున పిచికారి చేయాలని సూచించారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల దృష్ట్యా వరి కి ఆకుమచ్చ తెగులు ఆశించే అవకాశం ఉందన్నారు. వ్యవసాయ అధికారుల సలహాలు సూచనలు పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో శాస్త్రవేత్తలు శ్రీనివాస్ రెడ్డి, విజయ్, ప్రశాంతి, మండల వ్యవసాయ అధికారి యాస్మిన్, వీడీసీ చైర్మన్ కరుణాకర్, ఏఈవో సంపత్ తదితరులు పాల్గొన్నారు.
- August 25, 2020
- Archive
- కరీంనగర్
- షార్ట్ న్యూస్
- AGRICULTURE
- FARMER
- KARIMNAGAR
- RAMADUGU
- తెగుళ్లు
- రైతులు
- వ్యవసాయం
- శాస్త్రవేత్తలు
- Comments Off on పత్తిలో తెగుళ్లను అరికట్టండిలా..!