Breaking News

పత్తిరైతు కన్నీరు

పత్తిరైతు కన్నీరు

సారథి న్యూస్, దేవరకద్ర: ఈ ఏడాది కాలం కలిసొచ్చిందనుకుంటే ముసురు వర్షం రైతులను కన్నీరు పెట్టిస్తోంది. భారీ వర్షాల నేపథ్యంలో మహబూబ్​నగర్​ జిల్లా దేవరకద్ర మండలంలోని పత్తి రైతులు ఆందోళన చెందుతున్నారు. నాలుగు రోజులుగా కురుస్తున్న వానలకు పత్తి పొలాల్లోకి విపరీతంగా నీరు వచ్చిచేరింది. దీంతో పంటంతా ఊట ఎక్కుతుందని రైతులు ఆవేదన చెందుతున్నారు. దేవరకద్ర మండలంలో ఈ ఏడాది సుమారు 11వేల ఎకరాల్లో వరినాట్లు వేశారు. మండలంలోని గోపనపల్లి, పుట్టపల్లి, కౌకుంట్ల, రాజోలి, వెంకటగిరి, వెంకంపల్లి గ్రామాల్లో పత్తి పంటను ఎక్కువ విస్తీర్ణంలో సాగుచేశారు. ప్రస్తుత వర్షాలకు పంటంతా నీటిపాలు కావడంతో ఏం చేయాలోనని దిక్కుతోచనిస్థితిలో పడ్డారు.