జైపూర్: కరోనాకు మందు కనిపెట్టామని, దాని ద్వారా వంద శాతం రోగం నమయమవుతుందని చెబుతూ యోగా గరువు రామ్‌దేవ్ బాబా, పతంజలి సీఈవో ఆచార్య బాలకృష్ణ, మరో ముగ్గురిపై రాజస్థాన్‌లో కేసు నమోదైంది. వాళ్లంతా ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని రాజస్థాన్ జైపూర్‌లోని జ్యోగినగర్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. యోగా గురువు రామ్‌దేవ్ బాబా, ఆచార్య బాలకృష్ణ, నిమ్స్ చైర్మన్ డాక్టర్ బల్బీర్ సింగ్ తొమార్, డైరెక్టర్ డాక్టర్ అనురాగ్ తొమార్, సైంటిస్ట్ అనురాగ్ వర్షణేపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు చెప్పారు. బల్రామ్ జాఖర్ అనే వ్యక్తి ఈ కేసు పెట్టారన్నారు.
ఐపీసీ సెక్షన్ 420 కింద చీటింగ్ కేసు పెట్టామన్నారు. పతంజలి నుంచి కరోనాకు డ్రగ్ కనిపెట్టామని, కొరోలిన్ పేరుతో రామ్‌దేవ్ బాబా డ్రగ్‌ను రిలీజ్ చేశారు. వందశాతం రోగాన్ని తగ్గిస్తుందన్నారు. అయితే ఆయుష్ మినిస్ట్రీ దానిపై రెస్ట్రిక్షన్స్ విధించింది. కరోనా మందు అని ప్రచారం చేయొద్దని చెప్పింది. కాగా.. మహారాష్ట్ర, రాజస్థాన్ ప్రభుత్వాలు కూడా ఆ మందును అమ్మొద్దని, అమ్మితే చర్యలు తీసుకంటామని చెప్పాయి. పర్మిషన్ లేకుండా క్లినికల్ ట్రయల్స్ చేసినందుకు గాను నిమ్స్ డైరెక్టర్‌కు ఇప్పటికే నోటీసులు కూడా జారీ చేశారు.